వందేభారత్ రైళ్ల గొప్ప ఏంటి?

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తుంటుంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైళ్లు ఆక్యుపెన్సీ విషయంలో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని అధిగమించే సెమీ హైస్పీడ్ రైళ్లుగా ప్రాచుర్యం పొందాయి. వీటి గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు.

2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ మధ్య 100 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో 2,140 ట్రిప్పులు తిరిగి, 25.20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వందేభారత్ మొదటి రైలు ప్రారంభమైనప్పటినుంచి వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉందని, ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. అన్నిరకాలుగా వీటిల్లో సౌకర్యాలుండటం కూడా ఆక్యుపెన్సీ పెరగడానికి కారణమని అధికారులు వెల్లడించారు.

vandebharath

ప్రస్తుతం ఇవి గంటకు 160 కిలోమీటర్ల వేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రయాణ సమయంలో దాదాపు గంట నుంచి గంటన్నర వరకు ఆదా అవుతోంది. దీనివల్లే వీటికి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారుచేస్తున్నారు. ఎయిర్ రెసిస్టెన్సీ తక్కువగా ఉంటుంది.ఇంటీరియర్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. కూర్చొనే సీట్లు 180 డిగ్రీలో రొటేట్ అవుతాయి. బోగీలకు పెద్ద పెద్ద అద్దాలు అమర్చి ఉంటాయి. దీనివల్ల ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది. బుక్ రీడింగ్ లైట్స్, ప్రతి కోచ్‌లో జీపీఎస్ ఫెసిలిటీతోపాటు మరెన్నో ప్రత్యేకతలు వందే భారత్ రైళ్ళ సొంతం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+