గుజరాత్ ఎన్నికలు: 822 మందిపై కేసులు, 199 కోటీశ్వరులు బరిలోకీ

Posted By:
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు చాలా మంది బరిలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే 101 అసెంబ్లీ స్థానాల్లో 822 మంది నేర చరితులు బరిలో ఉన్నారు. అయితే 62 మందిపై తీవ్రమైన కేసులున్నాయి.

గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు రెండు రోజుల్లో జరగనున్నాయి. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది.

అయితే గుజరాత్ రాష్ట్రంలో తాము తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.

 822 మంది నేర చరితులు

822 మంది నేర చరితులు

గుజరాత్ రాష్ట్రంలో రెండో దఫా సుమారు 101 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థుల్లో సుమారు 822 మందిపై పలు కేసులున్నాయి. అయితే ఇందులో 62 మందిపై తీవ్రమైన నేరాల కేసులున్నాయి. ఎన్నికల్లో నేర చరితులు పోటీ చేయకూడదని పలు సామాజిక సంస్థలు ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదు.

 ఇద్దరిపై హత్య కేసులు

ఇద్దరిపై హత్య కేసులు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్న వారిలో ఇద్దరిపై హత్య కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.అంతేకాదు మరో ఇద్దరిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.మరో ఇద్దరిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులు నమోదయ్యాయి.ముగ్గురిపై కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.

 కాంగ్రెస్ అభ్యర్థులపై కేసులెక్కువ

కాంగ్రెస్ అభ్యర్థులపై కేసులెక్కువ

.గుజరాత్ అసెంబ్లీకి రెండో విడత ఎన్నికలు జరిగే 101 స్థానాల్లో బరిలో ఉన్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థుల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై నేరాల కేసులున్నాయి. 86 మంది అభ్యర్థుల్లో 22 మంది బిజెపి అభ్యర్థులపై కేసులున్నాయి. 88 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 25 మందిపై కేసులున్నాయి.74 మంది బిఎస్పీ అభ్యర్థుల్లో ఆరుగురు అభ్యర్థులపై కేసులున్నాయి.27 మంది ఎన్సీపీ అభ్యర్థుల్లో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి.ఏడుగురు ఆప్ అభ్యర్థుల్లో ఒకరిపై కేసు నమోదైంది.344 స్వతంత్ర్య అభ్యర్థుల్లో 14 మందిపై నేరాలు చేసిన చరిత్ర ఉంది.

 199 మంది కోటీశ్వరులు

199 మంది కోటీశ్వరులు

గుజరాత్‌లో రెండో దశలో జరిగే 101 అసెంబ్లీ స్థానాల్లో 822 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వీరిలో సుమారు 199 మంది కోటీశ్వరులు బరిలో నిలిచారు.బిజెపి నుండి 66 మంది, కాంగ్రెస్ నుండి 67 మంది, ఎన్సీపి నుండి 10 మంది, ఆప్ నుండి ఐదుగురు, బిఎస్పీ నుండి ముగ్గురు మాత్రమే కోటీశ్వరులున్నారు.ఒక్కొక్క అభ్యర్థి సగటు ఆస్తుల విలువ సుమారు రూ.2.39 కోట్లు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the second phase of the Gujarat assembly elections 101 out of the 822 candidates have declared pending criminal cases against them. Out of the 101, there are 64 candidates who have declared serious criminal cases against them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి