జలియన్ వాలాబాగ్ దురాగతానికి 104 ఏళ్లు.!రౌలత్ చట్టం రగిల్చిన రౌద్రం.!డయ్యర్ రక్తచరిత్ర.!
హైదరాబాద్: ఆంగ్లేయ పాలకుల నిర్బంధానికి నిరసనగా పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్‌లో వేలాది మంది సమావేశం అయ్యారు. పైగా ఆ రోజు పంజాబీ ప్రజల నూతన సంవత్సర పండుగ వైషాఖి కావటంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. బ్రిటీష్ జనరల్ డయ్యర్ అమానుష కాల్పుల వల్ల వందలాది మంది బలయ్యారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. భారతదేశంలో జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. ఈ దర్ఘటనకు గురువారంతో 104 ఏళ్లు నిండాయి.
డయ్యర్ అమానుషం.. ఎగిసి పడ్డ స్వాతంత్య్రోద్యమ కాంక్ష: జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.
ఏప్రిల్ 13, 1919 న బ్రిటిష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిపించాడు జనరల్ డయ్యర్.

స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తి.. బ్రిటిష్ నిర్ణయాల పట్ల విసిగిపోయిన గాంధీ: 1920లో గాంధీ జీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది ఈ దుర్గటన. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం.
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటిష్ ప్రభుత్వం తన కిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశారు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు. అప్పటివరకూ ఆగ్రేయుల పట్ల కాస్త సానుకూలంగా వ్యవహరించిన మహాత్మా గాంధీ తన పంథాను కూడా ఈ దుర్గటనతో మార్చుకున్నారు.

జలియన్ వాలాబాగ్.. ఘోర సంఘటనకు ముందు ఏం జరిగింది: అంతకు ముందే ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్‌వారికి అకూలంగా, మన దేశం తరపున సైన్య సహాయాన్ని పంపాలనే గాంధీ నిర్ణయానికి కట్టుబడి భారత్ తరపున సైన్యం, యుద్ధానికి కావలసిన ఆయుధ సామగ్రి కోసం డబ్బు పంపిణీ, ఈ విధంగా మనకు చాలానే నష్టం జరిగింది. ఇంత సహాయం చేసినా గాంధీ ఊహించినట్లు, బ్రిటీష్‌వారు మనకు స్వాతంత్య్రం ఇవ్వలేదు.
యుద్ధం తర్వాత స్వాతంత్య్రం రాలేదు సరికదా ద్రవ్యోల్బణం పెరిగింది. పన్నులు పెరిగాయి. ఈ సంఘటనలతో ప్రజల్లో పెరిగిన విప్లవాన్ని అణచటానికి బ్రిటీష్ ప్రభుత్వం 'రౌలత్ చట్టం' చేసింది. ఈ చట్ట ప్రకారం విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించవచ్చు. అలాగే తిరుగుబాటుదారులుగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు! ఈ చట్టంపై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

అన్ని ద్వారాలు మూసివేసిన సైనికులు.. రక్తపుటేరులు పారిన జలియన్ వాలాబాగ్: అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రవేశ మార్గాల వద్దకు వెళ్లారు. మొత్తం ఐదు ప్రవేశ మార్గాలు ఉండగా ఒకటి మాత్రమే పెద్దది.
అయితే దీన్ని బ్రిటిష్ సైనికులు మూసివేయడంతో ప్రజలకు తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. తప్పించుకునే క్రమంలో పార్క్‌లోని బావిలో ప్రజలు దూకేశారు. ఇక్కడ నుంచే 120 మృతదేహాలను వెలికితీశారు. సామ్రాజ్యవాదులు తమ రాజ్యాధికారం నిలబెట్టుకోవటానికి.. విప్లవ భావాలను మొగ్గ దశలోనే అణచివేయటం కోసం ప్రజల ప్రాణాలను ఎంత సునాయాసంగా తీయగలరో చెప్తుంది ఈ 'జలియన్ వాలాబాగ్ మారణకాండ'.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications