సిక్కింలో 107 ఏళ్ల బామ్మ, నాగాలాండ్‌లో శతాధిక వృద్ధుడు : వృద్ధుల్లో వెల్లివిరిసిన చైతన్యం
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. పౌరుల పాలిట బ్రహ్మాస్త్రం. ఐదేళ్లకొసారి వచ్చే ఎన్నికల్లో ఓటేసేందుకు కొందరు వయోజనులు ఆసక్తి చూపకపోగా .. శతాధిక వృద్ధులు వీల్ చెయిర్‌లో వచ్చి ఓటేసి తమ బాధ్యతను గుర్తుచేసి .. భావి భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారు.

సిక్కింలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు
సిక్కిం రాష్ట్రంలో ఓ 107 ఏళ్ల బామ్మ సుమిత్రా రాయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాక్‌లాక్ కమ్‌రాంగ్ నియోజకవర్గంలోని ్ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతు వద్దకు వీల్ చెయిర్‌లో వచ్చారు సుమిత్రా. అక్కడ తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఈ మేరకు సిక్కిం సమాచార శాఖ సుమిత్రా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నాగాలాండ్‌లో శతాధిక వృద్ధుడు
సుమిత్రాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ .. నాగాలాండ్‌లో ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. మోకోక్‌చుంగ్ జిల్లాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇతనే కాక దేశంలో వివిధ ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్లు తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. గయాలో ఓ వృద్ధుడికి సీఆర్పీఎఫ్ జవాన్లు సాయం అందజేశారు. నాగ్‌పూర్‌లో కూడా వృద్ధుల ఓట్లు అధికంగా నమోదయ్యాయి.

వామ్మో ..17 సార్లు ఓటేసింది
జమ్ముకశ్మీర్‌లో సత్య దేవి అనే 83 ఏళ్ల వృద్ధురాలికి జవాన్లు సాయం అందించారు. చేయిపట్టుకొని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఇవాళ ఓటేసిన సత్యదేవి .. మొత్తం 17 సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోని రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications