• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

11వేల హాట్‌స్పాట్ కేంద్రాలు, 15జీబీ డాటా ఫ్రీ...! అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు..

|

రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కోక్కటిగా అమలు పరుస్తున్నాడు. ఇప్పటికే ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించి ప్రజలకు చేరువయ్యాడు. ఈనేపధ్యంలోనే యువతకు దగ్గరయ్యోందు కోసం ఇంటర్‌నెట్‌పై దృష్టి సారించాడు.

ప్రస్థుత రోజుల్లో ఇంటర్ లేకుండా ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్న యువతకు ఫ్రీ ఇంటర్‌నెట్ డాటా ప్రకటించాడు.

ప్రతి నెల 15జీబీ ఇంటర్‌నెట్ డాటా ఫ్రీ

ప్రతి నెల 15జీబీ ఇంటర్‌నెట్ డాటా ఫ్రీ

ఎన్నికల వరాల్లో భాగంగా యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ నగరంలో మొత్తం 11000 ఉచిత వైఫై హట్‌స్పాట్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రతి ఒక్కరికి 15జీబీ డాటాను ప్రతినెల ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం గత సంవత్సరమే 100 కోట్ల రుపాయాలను కేటాయించిన కేజ్రీవాల్ ప్రభుత్వం, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి 50 మీటర్లుకు ఒక హట్‌స్పాట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెంటర్ నుండి సుమారు 200 మంది వినియోగదారులు కనెక్ట్ అయ్యో విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. పలు అంశాలపై చర్చించేందుకు భేటి అయిన రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా వైఫై ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనుండగా పర్యవేక్షణ బాద్యత అంతా ప్రభుత్వానిదే అని ప్రకటించారు.

భద్రతపై సీసీ నజర్, 14 లక్షల సీసీ కెమేరాలు

భద్రతపై సీసీ నజర్, 14 లక్షల సీసీ కెమేరాలు

మరోవైపు నగరంలోని రక్షణ చర్యలపై కూడ కేజ్రీవాల్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మొత్తం 14 లక్షల సీసీ కేమేరాలను నగరంలో అదనంగా అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.మొత్తం ఇరవై ఎనిమిది లక్షల సీసీ కెమారాలను అమర్చలని నిర్ణాయించామని, ఇప్పటికే ఇందుకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయని మరో మూడు నాలుగు నెలల్లో సీసీకెమేరాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 70లో 67 సీట్లు సాధించిన కేజ్రీవాల్, పార్లమెంట్ ఎన్నికల్లో బోల్తా..

70లో 67 సీట్లు సాధించిన కేజ్రీవాల్, పార్లమెంట్ ఎన్నికల్లో బోల్తా..

ఇక గత ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలను సాధించి పెద్ద ఎత్తున విజయం సాధించింది. అయితే ఇటివల జరిగిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. మొత్తం 7 పార్లమంట్ స్థానాల్లో పోటి చేసిన ఆప్ కనీసం ఒక్క సీటును కూడ గెలుపోందలేదు. దీంతో అలర్ట్ అయిన కేజ్రీవాల్ ప్రజల మన్ననలు పోందేందుకు పలు పథకాలను తీసుకువస్తున్నట్టు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Delhi cabinet has approved setting up of 11,000 free Wi-Fi hotspots in the city that would allow smartphone and computer users to use 15GB of internet data every month at a maximum speed of 200 mbps, chief minister Arvind Kejriwal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more