కరోనా డేంజర్ బెల్స్ - బారీగా కేసులు, కీలక సూచనలు..!!
మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా తిరిగి వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల సంఖ్య భారీగా నమోదువుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు సూచనలు చేస్తున్నారు.
కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే ఏకంగా 11 వేలకు పైగా కేసులు నమోదు కావటంతో అందోళన మొదలైంది. 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11,109 కొత్త కేసులు వెలుగు లోకి వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. ప్రస్తుతం 49,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,16,583 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,064 కి చేరింది. పాజిటివ్ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా గుర్తించారు. మరో 10-12 రోజుల పాటు కేసుల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత క్రమేణా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలో ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవటం అవసరమి వైద్యులు సూచిస్తున్నారు. ఇక, ఢిల్లీలో 24 గంటల సమయంలో 1,527 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు.












Click it and Unblock the Notifications