కొనసాగుతున్న కరోనా తీవ్రత - పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 11,692 కేసులు నమోదయ్యాయి. గతం రోజు కేసుల కంటే కొత్త కేసుల్లో 7 శాతం తగ్గుదల కనపడింది. యాక్టివ్ కేసులు సంఖ్య 66,170కు పెరిగింది. కరోనా వల్ల దేశంలో 24 గంటల్లో మరో 28 మంది ప్రాణాలు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,72,256కు పెరిగినట్లు వివరించింది. కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్ల (4,48,69,684)కు పెరిగింది. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,31,258కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం ఇన్ఫెక్షన్లో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు వెల్లడించింది. కొవిడ్ రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైనట్లు చెప్పింది.

దేశంలో చేపట్టిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసులను వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో వారం రోజుల పాటు కేసుల సంఖ్య తీవ్రంగా ఉంటుందని, ఆ తరువాత క్రమేణా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సబ్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరిగిందని వివరిస్తున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.

సబ్ వేరియంట్ లక్షణాలు కరోనా కంటే భిన్నంగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. తగ్గని జ్వరం, జలుబు..దగ్గు వంటి లక్షణాలతో ఇన్ఫోక్షన్లతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని గుర్తించారు. అయితే, కేసుల సంఖ్య పెరగటం పైన ఆందోళన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications