మావోయిస్టుల ఘాతుకం: ఎన్‌కౌంటర్‌లో 25 మంది జవాన్ల మృతి
చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో పదకొండు మంది వరకు గాయపడ్డారు.
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో సోమవారం 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు.
వారిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారని, అప్పుడు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

ఈ ఎన్‌కౌంటర్ బర్కాపాల్ - చింతగుహ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతి చెందిన జవాన్లు సీఆర్పీఎఫ్ 74 బెటాలియన్‌కు చెందిన వారు. ఇంతకుముందు ఈ ఏడాదే ఇక్కడే 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు.












Click it and Unblock the Notifications