ఘోరం: టెంపో, లారీ ఢీ: 11 మంది మృతి

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ టెంపో, లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. వారణాసి-లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రతాప్‌గఢ్ జిల్లాలోని జగత్‌పూర్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాన్‌పూర్ జిల్లాలోని ముగ్రా బాద్షాపూర్ ప్రాంతంలోని దౌలతీయ గ్రామానికి చెందిన అయిదుగురు పురుషులు, పన్నెండు మంది స్త్రీలు, మరికొంతమంది పిల్లలు కలిసి ప్రతాప్‌గఢ్ జిల్లా రాణిగంజ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న రయ్యాదేవి ఆలయానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది.

accident

ఫాతెన్‌పూర్ పోలీసుల కథనం ప్రకారం.. ప్రమాదం స్థలంలోనే ఇద్దరు మరణించారు, ఆసుపత్రికి తరలించాక మరో తొమ్మిది మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం అలహాబాద్‌కు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారాన్నిఆయన ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+