సముద్రంలో నౌక మునక: 11మంది భారతీయులు గల్లంతు
సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది భారతీయులు గల్లంతయ్యారు.
టోక్యో: సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని జపనీస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది.
జపనీస్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కార్గో నౌకలో 26 మంది భారతీయులు ఉన్నారు. టైఫూన్ కారణంగా సముద్రమంతా అల్లకల్లోలంగా మారడంతో నౌక మునిగిపోయింది. 26 మందిలో 15 భారతీయ సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు.

కాగా, మిగతా 11 మంది గల్లంతయ్యారు. రెండు పెట్రోల్ బోట్స్, మూడు విమానాల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే.. టైఫూన్ కారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో గాలింపు చర్యలు కష్టమైనట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications