మసీదులో అడుగు పెట్టిన మహిళా తహశీల్దార్: కోలార్‌లో మర్కజ్ తరహా ఉదంతానికి అడ్డుకట్ట.. అరెస్టు

కోలార్: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగిపోవడానికి ప్రధాన కారణం.. తబ్లిగి జమాతీలేననే ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల తరహాలోనే మసీదులో గుమికూడారు కొందరు వ్యక్తులు. పవిత్ర రంజాన్ మాసం తొలి శుక్రవారం కావడంతో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించడానికి ప్రయత్నించారు.

ఈ సమాచారం తెలిసిన వెంటనే మహిళా తహశీల్దార్ రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లారు. ఏ మాత్రం సంకోచించకుండా మసీదులోకి అడుగు పెట్టారు. గుమికూడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాల కింద వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. అరెస్టయిన వారిలో మసీదు మౌల్వీ కూడా ఉన్నారని తెలుస్తోంది.

11 members arrested at Kolar in Karnataka on Friday

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది ఈ ఘటన. కోలార్‌కు చెందిన కొందరు వ్యక్తులు స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించడానికి ప్రయత్నించారు. రంజాన్ మాసంలో వచ్చిన తొలి శుక్రవారం కావడం వల్ల వారు మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడానికి వచ్చారు. మసీదులో ప్రత్యేకంగా నమాజ్ చేస్తున్నట్లు స్థానికులు కోలార్ తహశీల్దార్ శోభిత, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే ఆమె పోలీసులను వెంటబెట్టుకుని మసీదుకు వెళ్లారు. వారంతా నమాజ్ చేస్తున్న సమయంలో ఆమె మసీదులోకి ప్రవేశించారు. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉందనే విషయం తెలియదా? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నమాజ్ చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముస్లిం సంప్రదాయం ప్రకారం.. మసీదుల్లో మహిళలు ప్రవేశించకూడదు. అయినప్పటికీ.. విధి నిర్వహణలో భాగంగా మసీదులో అడుగు పెట్టడానికి శోభిత ఏ మాత్రం సంకోచించలేదు. మర్కజ్ తరహా ఉదంతాన్ని నివారించడానికి ఆమె తెగువను ప్రదర్శించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+