11మందికి జైలు శిక్ష: మహిళను నగ్నంగా చిత్రీకరించి దాడి
ముంబై: 22 ఏళ్ల మహిళను వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించి ఆమెపై దాడి చేసిన ఘటనలో 11 మంది మహిళలతో పాటు ఒక వ్యక్తికి ముంబైలోని సెషన్స్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. 2010లోసెవ్రిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
2010, జూన్ 17న బాధితురాలిపై దాడి చేసి అత్యంత దారుణంగా కొట్టి నడిరొడ్డుపై నగ్నంగా ఊరేగించారు. ఇందులో బాధితురాలు చేసిన తప్పేమీ లేదు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు బాధితురాలి అన్నయ్యను నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అన్న చేసిన తప్పుకు బాలిక బంధువులు బాధిత మహిళను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి ఆమెను అందరూ చూస్తుండగా నగ్నంగా ఆమెపై దాడి చేసిన అత్యంత దారుణంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి బాధిత మహిళ పట్ల బాలిక బంధువులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఓ మహిళపై దాడిచేసి ఆమె మానానికి భంగం కలిగించిన కేసులో మహిళలు శిక్షార్హులుకారని, మగవాళ్లు తప్పుచేస్తేనే శిక్షించాలని సెక్షన్‌లో ఉందన్న డిఫెన్స్ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
సెక్షన్‌లో వాడిన 'అతడు' అనే సర్వనామం ఎవరికైనా వర్తిస్తుందని, నేరం చేసినవాళ్లు మహిళలయినా, పురుషులయినా శిక్షార్హులేని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు గాను బాధితురాలిపై దాడి చేసి, ఆమె మనోభావాలను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకు నిందుతులకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు సోమవారం తీర్పునిచ్చారు.












Click it and Unblock the Notifications