జోధ్‌పూర్‌లో రెండు లారీ ఢీ: 11మంది మృతి
న్యూఢిల్లీ: రాజస్ధాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రహదారిపై వెళుతున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వారిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జోధ్ పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications