బాంబు ఉందని ఫోన్ కాల్: 11 స్కూళ్లకు సెలవు
చెన్నై: బాంబు బెదిరింపు ఫోన్ కాల్ తో హడలిపోయిన పోలీసులు, పాఠశాలల యాజమాన్యాలు 11 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బాంబు ఎక్కడ ఉంది అంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి బాంబు చిక్కకపోవడంతో పోలీసులు, పాఠశాలల యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నారు.
చెన్నై నగరంలోని శాంథోం చర్చి ఏరియాలోని పాఠశాలల్లో బాంబు ఉందంటూ మంగళవారం సిటీ పోలీసు కంట్రోల్ రూంకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. వెంటనే పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోని 11 పాఠశాలల యాజమన్యాలను అప్రమత్తం చేశారు.
వెంటనే పాఠశాలల యాజమాన్యాలు 11 స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకుని పిల్లలను సురక్షితంగా బయటకు పంపించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు విషయం తెలియండంతో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి.

పోలీసులు, బాంబు నిర్వీర్యదళం బృందాలు 11 స్కూళ్లలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి బాంబు కనపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో కావాలని బాంబు బెదిరింపు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు.
ఎప్పటిలాగే బుధవారం స్కూళ్లు ప్రారంభిస్తామని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. బాంబు బెదిరింపు ఫోన్ చేసింది ఎవరు, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెన్నై పోలీసులు అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications