వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్న తండ్రి మోసం: 11 ఏళ్ల చిన్నారికి తప్పని కూటి తిప్పలు.. కలెక్టర్‌ను ఆశ్రయించడంతో..

|
Google Oneindia TeluguNews

తండ్రి.. సమాజంలో మంచి స్థానం ఉంది. నాన్న అంటే బాధ్యత అని, నడక, నడత నేర్పుతారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఒడిశాలో మాత్రం ఓ తండ్రి తన స్థానానికి కళంకం తీసుకొచ్చాడు. పిల్లల ఆలానా పాలానా చూడకపోగా.. మధ్యాహ్నా భోజనం కోసం ప్రభుత్వం వేసిన నగదును వాడుకున్నాడు. కానీ ఆ చిన్నారి ఊరుకోలేదు. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడంతో చర్యలు ప్రారంభమయ్యాయి.

 చిన్నారికి మోసం

చిన్నారికి మోసం

కేంద్రపర జిల్లా దుకుకా గ్రామానికి చెందిన రమేశ్ చంద్ర సేత్‌కు 11 ఏళ్ల బాలిక సుశ్రీ సంగీత సేతీ ఉంది. ఆమె స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. అయితే ఆయన భార్య చనిపోవడంతో.. మామ దగ్గర ఆమెను వదిలేశాడు. మరో పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు. కానీ చిన్నారికి వచ్చే మధ్యాహ్నా భోజనానికి సంబంధించిన డబ్బులను పందికొక్కులా మెక్కుతున్నాడు. సాధారణంగా స్కూల్ తెరిచే ఉంటే మిడ్ డే మిల్స్ అందించేవారు. కరోనా వైరస్ వల్ల చిన్నారులు స్కూల్‌కి రావడం లేదు. దీంతో వారి భోజనానికి అయ్యే వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు.

తండ్రి ఖాతాలో జమ

తండ్రి ఖాతాలో జమ

చిన్నారి బ్యాంకు ఖాతా ఉన్న అతని తండ్రి అకౌంట్‌లో జమచేస్తున్నారు. ఆలానా పాలానా మరచిన తండ్రి.. ఆమెకు వచ్చిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చిన్నారి కేంద్రపర కలెక్టర్‌ని కలిసింది. తన సమస్యను కలెక్టర్ సామ్రాట్ వర్మకు వివరించింది. దీనిపై వెంటనే కలెక్టర్ స్పందించారు. చిన్నారి ఖాతాలో డబ్బులు జమచేయాలని డీఈవోను ఆదేశించారు. చిన్నారి తండ్రి నుంచి నగదు రికవరీ చేయాలని స్పష్టంచేశారు.

ఇక నుంచి చిన్నారికి స్వయంగా..

ఇక నుంచి చిన్నారికి స్వయంగా..

కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నారి అకౌంట్‌లో నగదు వేస్తామని డీఈవో చెప్పారు. లేదంటే చిన్నారికి హెడ్ మాస్టర్ స్వయంగా బియ్యం అందజేస్తారని తెలిపారు. కరోనా వైరస్ వల్ల చిన్నారులకు రోజు 150 గ్రాముల బియ్య, రోజు రూ.8.10 రూపాయల నగదు అందిస్తున్నారు. నగదును విద్యార్థుల ఖాతాలో వేస్తున్నారు. చిన్నారి సుశ్రీకు అకౌంట్ ఉండగా.. తండ్రి దానిలో వేయడం వివాదానికి కారణమయ్యింది. ఆ తండ్రి నగదు కూడా ఇవ్వడం లేదు. దీంతో కలెక్టర్‌ను కలువగా ఆమెకు న్యాయం జరిగింది.

English summary
Class VI student of Dukuka village walked 10 km to lodge a complaint with Kendrapara Collector against her father for allegedly taking away mid-day meal money and rice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X