కాశ్మీర్ లో పేలుడు: జవాన్లకు తీవ్రగాయాలు (వీడియో)
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని ఆర్మీ క్యాంపులో శనివారం పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ పేలుడులో 12 మంది జవాన్లకు తీవ్రగాయాలైనాయి. వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం దక్షిణ కాశ్మీర్ లోని అవంతిపురా ఏరియాలోని పుల్వామాలోని ఆర్మీ క్యాంపులో ఈ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే అందరికి ప్రథమ చికిత్స అందించి ప్రత్యేక ఆంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు.

అయితే పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని ఆర్మీ అధికారులు అంటున్నారు. పేలుడు ఎలా జరిగింది అని దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, అయితే దర్యాప్తు కొనసాగుతుందని ఆర్మీ సినియర్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications