Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతు ఉద్యమానికి 6నెలలు, మోదీ పాలనకు 7ఏళ్లు -మే 26న భారత్‌కు బ్లాక్ డే -12 ప్రతిపక్ష పార్టీల మద్దతు

కరోనాతో చావనైనా చస్తాంగానీ సాగు చట్టాలపై పోరులో వెనక్కి తగ్గబోమంటున్నారు రైతులు. వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తోన్న నిరసనలు మరో మైలురాయిని చేరనున్నాయి. ఈక్రమంలో రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్ఛా(ఎస్కేఎం) కీలక పిలుపునిచ్చింది..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమానికి ఈనెల 26 నాటికి ఆరు నెలలు నిండనున్నాయి. అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనకు ఏడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని 'బ్లాక్ డే'(చీకటి రోజుగా) గుర్తిస్తూ రైతు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. మే 26న గ్రామాలు మొదలుకొని ఢిల్లీ దాకా అన్ని చోట్లా నల్ల జెండాలతో నిరసనలు తెలపాలన్నకిసాన్ మోర్ఛా పిలుపునకు దేశంలోని 12 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా సంపూర్ణ మద్దతు పలికాయి.

12 Oppn parties support Samyukta Kisan Morcha May 26 black day protest call

రైతులు తలపెట్టిన 'మే 26 బ్లాక్ డే' కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నామని, కొవిడ్ నిబంధనల మేరకు నిరసన కార్యక్రమాల్లో తామూ పాల్గొంటామని 12 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా ప్రకటన చేశాయి. సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని ప్రధానిని డిమాండ్ చేస్తూ రాసిన లేఖపై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు.

రైతు నిరసనలకు మద్దతు తెలుపుతూ ప్రతిపక్షాలు ఉమ్మడిగా విడుదల చేసిన లేఖపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీఎస్ అధినేత దేవేగౌడ, వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జేఎఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీ నేత ఫారూఖ్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఐ నేత డి. రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరిలు సంతకాలు చేశారు. ఎప్పటిలాగే ఈ ప్రతిపక్షాల కూటమి.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలను పక్కనపెట్టేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+