బిస్కెట్ దొంగిలించారని బట్టలూడదీసి చావ బాదారు

boy beaten to death
పాట్నా/భువనేశ్వర్: ఆకలిని తీర్చుకోవడానికి బిస్కట్లు దొంగిలించిన ఓ బాలుడిని గ్రామస్తులు పాశవికంగా తల కిందులుగా వేలాడదీసి కొట్టారు. దెబ్బలకు తాళలేని ఆ బాలుడు ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్ణియా జిల్లాలోని తాడి గ్రామానికి చెందిన 12 ఏళ్ల చోటు కుమార్, మరో బాలుడు పింటూ కుమార్‌తో కలిసి ఒక దుకాణంలో కరెంటు లేని సమయంలో బిస్కట్ ప్యాకెట్‌ను దొంగిలించారు.

వీరిద్దర్నీ పట్టుక్ను ఎనిమిది మంది గ్రామస్తులు వారి తల్లిదండ్రులను రూ.10 వేల జరిమానాను చెల్లించమని డిమాండ్ చేశారు. అయితే వారి వద్ద అంత డబ్బు లేదని బాలుర తల్లిదండ్రులు చెప్పడంతో వారి కళ్లముందే ఆ ఇద్దరు బాలురను బట్టలూడదీసి తల కిందులుగా వేలాడదీసి చావ బాదారు. దీంతో దెబ్బలను తాళలేక చోటు కుమార్ మృతి చెందాడు. మృతుని తల్లిదండ్రులు నిందితులైన ఎనిమిది మంది గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మహిళా రేషన్ డీలర్ సజీవ దహనం

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఘోరం జరిగింది. నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతోందన్న ఆగ్రహంతో ఓ మహిళా రేషన్ డిపో డీలర్‌ను నలుగురు దుండగులు సజీవ దహనం చేశారు. ఈ విషాధ సంఘటన గంజాం జిల్లా రంబ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ డీలర్ ప్రణతి నాయక్ సోమవారం సాయంత్రం తన సోదరి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు కాపుకాసి ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు.

ఆ సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన ప్రణతి ఇంటికి సమీపంలోనే జరగింది. శరీరం కాలిపోతుండగా ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ తన ఇంటివైపు పరుగులు తీసింది. స్థానికులు ఆమెను ఇక్కడి ఎంకెసిజి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి తరలించారు. కాగా తీవ్ర గాయలపాలైన ప్రణతి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. బాధితురాలు తన మరణ వాంగ్మూలంలో నిందితుల పేర్లు వెల్లడించడంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+