వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై మారణహోమానికి 12 ఏళ్ళు .. చేదు జ్ఞాపకాలు, మానని గాయాలు .. అమరులకు నివాళి

|
Google Oneindia TeluguNews

భారతదేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రమూక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించిన ఘటనకు నేటికి పన్నెండేళ్లు. నేటికి సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైపై ఆయుధాలతో విరుచుకుపడిన ఉగ్ర మూకలు సృష్టించిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. 12 మంది లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల మూక 2008 నవంబరు 26వ తేదీన ముంబై నగరం పై ఊహించని విధంగా విరుచుకుపడింది. నాటి చేదు జ్ఞాపకాలు, మానని గాయాలు ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి.

భారత భద్రతాదళాల దెబ్బకు సెప్టిక్ ట్యాంకుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులు భారత భద్రతాదళాల దెబ్బకు సెప్టిక్ ట్యాంకుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులు

నవంబర్ 26వ తారీఖున 2008వ సంవత్సరంలో ముంబైలో మారణకాండ ... నరమేధం

నవంబర్ 26వ తారీఖున 2008వ సంవత్సరంలో ముంబైలో మారణకాండ ... నరమేధం

బరితెగించిన ఉగ్రమూక దేశ ఆర్థిక రాజధానిని తూటాలతో తూట్లు పడేలా చేసింది. ఎన్నో కుటుంబాలను చిద్రం చేసింది. నేటికీ మానని గాయాలతో నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు నాడు అమరులైన వారి కుటుంబాలు.

నవంబర్ 26వ తారీఖున 2008వ సంవత్సరంలో జరిగిన ఉగ్రదాడితో భారతదేశం చిగురుటాకులా వణికిపోయింది. ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రదాడి ని తీవ్రంగా ఖండించాయి. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్ లో చొరబడి ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

 చత్రపతి శివాజీ టెర్మినస్ తో పాటు 12 చోట్ల ముష్కరుల దాడి .. 166 మంది బలి

చత్రపతి శివాజీ టెర్మినస్ తో పాటు 12 చోట్ల ముష్కరుల దాడి .. 166 మంది బలి


ఏకే 47 తుపాకులని ఎక్కుపెట్టి జరిపిన కాల్పుల్లో 58 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఊహించని దాడికి ప్రజలు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. అక్కడి నుండి వీధుల్లోకి వెళ్లి న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

నారీమన్ లైట్ హౌస్ ,ఒబెరాయ్ ట్రైడెంట్, కామా హాస్పిటల్ ,తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల దాడులతో ముంబై నగరం భీతిల్లి పోయింది. దాదాపు అరవై గంటల పాటు సాగిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు.

మరణించిన వారిలో 18 మంది భద్రతా సిబ్బంది

మరణించిన వారిలో 18 మంది భద్రతా సిబ్బంది

మరణించిన వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లోని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ ఖాన్ తదితరులు అమరులయ్యారు. చిద్రమైన మృతదేహాలతో, క్షతగాత్రుల ఆర్తనాదాలతో, మిన్నంటిన బంధువుల రోదనలతో ముంబై నగరం నాటి మారణకాండను నేటికీ మరచిపోలేకపోతుంది.

లష్కరే తోయిబా కు చెందిన పది మందిలో తొమ్మిది మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఇక ఈ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకున్నారు.ఈ కేసులో కసబ్ కు ఉరి శిక్ష విధించడంతో అతన్ని ఉరి తీశారు.

 నాటి మారణకాండ మరచిపోలేకపోతున్న భారత్ ... అమరులకు ప్రముఖుల నివాళి

నాటి మారణకాండ మరచిపోలేకపోతున్న భారత్ ... అమరులకు ప్రముఖుల నివాళి

నాటి మారణకాండలో మృతి చెందిన వారి కుటుంబాలు నేటికీ తమ వారి కోసం రోదిస్తున్నాయి. నేడు ఈ మారణకాండకు 12ఏళ్లు అయిన కారణంగా పలువురు ప్రముఖులు అమరులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నాటి ఘటనను గుర్తు చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. పోలీసుల శౌర్యాన్ని , త్యాగాన్ని ఈదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని ముంబై భయానక దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ట్వీట్ చేశారు.

వెంకయ్య నాయుడు, అమిత్ షా ట్వీట్స్ ... ముంబై అమరుల స్మారక స్థూపం వద్ద నివాళి

వెంకయ్య నాయుడు, అమిత్ షా ట్వీట్స్ ... ముంబై అమరుల స్మారక స్థూపం వద్ద నివాళి

ఉగ్రవాదానికి మద్దతిస్తున్న ప్రోత్సహిస్తున్న దేశాలను ప్రపంచమంతా కలిసి ఏకాకి చేయాల్సిన సమయం వచ్చిందంటూ వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముంబై దాడి ఘటనను గుర్తు చేసుకొని నాటి దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఇతరులను అడ్డుకునే క్రమంలో మీ ధైర్యం, త్యాగానికి ఈ దేశం ఎప్పటికి రుణపడి ఉంటుందంటూ అమరుల త్యాగాలను కొనియాడారు. దక్షిణ ముంబైలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్మారక స్థూపం వద్ద మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ,ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో పాటుగా రాష్ట్ర మంత్రులు అమరవీరులకు అంజలి ఘటించారు. నివాళులర్పించారు.

English summary
November 26 today marks the 12th anniversary of the terrorist attacks in Mumbai. Ten terrorists of Pakistan-based Lashkar-e-Taiba (LeT) carried out 12 coordinated shooting and bombing attacks lasting four days across Mumbai. At least 166 people, including six Americans and nine terrorists, were killed and over thousand people were injured in the attacks which began on November 26, 2008..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X