బడ్జెట్ హైలైట్స్ : రహదారుల ఆధునీకరణకు రూ.80 వేల కోట్లు.. ఎన్ని కిలోమీటర్లో తెలుసా ..!!

Recommended Video

    Union Budget 2019 : రహదారుల ఆధునీకరణకు రూ.80 వేల కోట్లు | Rs 80,250 Crore To Upgrade Roads

    న్యూఢిల్లీ : రహదారుల నిర్మాణానికి మోడీ సర్కార్ ప్రయారిటీ ఇస్తోంది. మోడీ తొలి మంత్రివర్గంలో కూడా జాతయ రహదారుల నిర్మాణంపై ఫోకస్ చేసింది. 2.0 ప్రభుత్వంలో కూడా భారీ కేటాయింపులు చేసింది. జాతీయ రహదారుల ఆధునీకరణ కోసం బడ్జెట్‌లో రూ.80 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    రవాణే కీలకం ..
    ఓ దేశ అభివృద్ధి జరగాలంటే రవాణా కీలకం. ట్రాన్స్‌పోర్టు ఉంటే మార్కెటింగ్ జరిగి అన్ని రంగాల చేరుకునే వెసులబాటు. దీంతో వారి .. వారి ఉత్పత్తుల విక్రయాలు, కొనుగోలు జరుగుతాయి. మోడీ 2.0 తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో దాదాపు 80 వేల 250 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్. దాదాపు లక్ష 25 వేల కిలోమీటర్ల వరకు రహదారులను ఆధునీకరిస్తామని స్పష్టంచేశారు. అంటే దేశంలో దాదాపు 97 శాతం నివాసాలకు రహదారి సౌకర్యం ఉంటుంది. మోడీ తొలి క్యాబినెట్‌లో దాదాపు 12 వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించిన సంగతి తెలిసిందే.

    125,000 km of road to be upgraded over next 5 years

    గ్రామాలపై ఫోకస్ ...
    ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారించినట్టు స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 3 కింద లక్షా 25 వేల కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరిస్తారు. తర్వాత ఇవి జాతీయ రహదారులతో అనుసంధానం కావడంతో .. ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. ఇదేకాదు రవాణారంగాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఇండస్ట్రియల్ కారిడార్లలో కూడా మౌలిక వసతులు కల్పిస్తామని గుర్తుచేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+