13 ఏళ్ల బాలుడి రాష్ డ్రైవింగ్: ముగ్గురు దుర్మరణం
అహ్మదాబాద్: ఓ 13 ఏళ్ల బాలుడు వేగంగా కారు నడుపుతూ ముగ్గురిని చంపేశాడు. మరో ముగ్గురిని గాయపరిచాడు. హుందాయ్ ఐ20 కారును 13 ఏళ్ల బాలుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తూ పరుగెత్తించాడు. దీంతో అదుపు తప్పి కారు రోడ్డు పక్కన పడుకున్నవారి మీదికి ఎక్కేసింది.
ఆ బాలుడును కారును అదుపు చేయలేకపోయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రమాదం జరిగిన తర్వాత బాలుడు కారుతో పాటు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారు.

బాలుడి తల్లిదండ్రులకు అతని రాష్ డ్రైవింగ్ గురించి ఇదివరకే స్థానికులు ఫిర్యాదు చేశారు. అతి వేగంగా కారును నడపడం ఆ బాలుడు చేస్తూ వస్తున్నాడని అంటున్నారు.
కారు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన అహ్మదాబాద్‌లో బుధవారంనాడు జరిగింది.












Click it and Unblock the Notifications