వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోరలు చాచిన కరోనా.. 14 రోజుల బేబీ మృత్యువాత

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోరలు చాచింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బలి తీసుకుంటుంది. సెకండ్ వేవ్ కావడంతో ఏ లక్షణాలు లేకున్నా వైరస్ అటాక్ అవుతోంది. దీంతో రెండు, మూడు రోజుల్లోనే సీరియస్ పరిస్థితి ఏర్పడుతోంది. కొందరు బతికి బట్టకడితే.. మరికొందరు చనిపోతున్నారు. గుజరాత్‌లో ఓ పసికందు మరణం విషాదం నిపింది. రోజుల పసిగుడ్డు కూడా కరోనా కాటుకు బలయిపోయింది.

గుజరాత్ సూరత్‌కి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 1వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు కరోనా సోకింది. దీంతో పుట్టిన బిడ్డకు కూడా రక్కసి కాటేసింది. బాలింతను మరో దవాఖానకు తరలించారు. బిడ్డను ఇంటెన్సివ్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో రెమ్ డెసివర్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారిని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందజేశారు.

14-day-old baby dies after testing Covid positive in Gujarats Surat

చిన్నారికి మాజీ మేయర్ సూరత్ జగదీశ్ పటేల్ ప్లాస్మా కూడా దానం చేశారు. సూరత్ ఇటీవల కరోనా సోకి.. కోలుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్మా దానం చేసినా ఫలితం లేకపోయింది. ఆ చిన్నారి కరోనాతో గెలవలేక తనువు చాలించింది. ఇటు గుజరాత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గురువారం సూరత్‌లో 1551 కరోనా కేసులు నమోదయ్యాయి. 26 మంది వైరస్‌తో చనిపోయారు.

English summary
14-day-old baby who tested positive for Covid-19 died in Gujarat's Surat on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X