ఆర్యన్ ఖాన్‌కు నిరాశ: 14 రోజుల కస్టడీ విధించిన కోర్టు, బెయిల్ పిటిషన్‌పై రేపు నిర్ణయం

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో నిరాశే ఎదురైంది. క్రూజ్‌ షిప్ డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆర్యన్‌ సహా ఎనిమిది మంది నిందితులకు ముంబై సిటీ కోర్టు జ్యుడిషియిల్‌ కస్టడీ విధించింది. అక్టోబర్ 11వరకు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఎన్సీబీ అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

ఇప్పటికే తగినంత సమయం ఇచ్చినందున నిర్బంధ విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన నిమిషాల వ్యవధిలోనే ఆర్యన్‌ తరఫు న్యాయవాది సతీశ్‌ మానేశిందే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, దీనిపై శుక్రవారం ఉదయం 11గంటలకు విచారణ జరపనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. కాగా, విచారణ సమయంలో షారుక్‌ ఖాన్‌, అతడి సతీమణి గౌరీఖాన్‌ కోర్టులో లేరు.

 14 days custody: Aryan Khan Applies For Bail, Mumbai Court Decision Tomorrow

అయితే, ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు ఇస్తున్న సమయంలో కోర్టులోనే ఉన్న షారుక్‌ ఖాన్‌ మేనేజర్‌ పూజా దడ్లానీ కంటతడి పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో న్యాయవాది సతీశ్‌ మానేశిందే ఆర్యన్‌ను ఆమె కలిసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఎన్సీబీ కార్యాలయానికి వారిని తరలించాక అక్కడ కుటుంబ సభ్యులు కలిసేందుకు న్యాయమూర్తి అనుమతించారు. జైలుకు తరలించేందుకు కొవిడ్ నిబంధనల నేపథ్యంలో కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఆర్యన్‌ సహా మిగతా నిందితులను ఈ రాత్రికి ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలోనే ఉంచనున్నారు.

Recommended Video

    డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడానికి మరో ప్రజా ఉద్యమం రావాలి!!

    కాగా, ముంబై తీర ప్రాంతంలో ఇటీవల గోవాకు చెందిన క్రూజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీపై ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్‌ ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మెర్చంట్‌ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది. ఆ కస్టడీ నేటితో ముగియడంతో మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్‌ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కాగా, ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు ఆరోపణలున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+