స్కూళ్లు బంద్ ..ఏకంగా 13 రోజులు

అక్టోబర్‌ నెల వచ్చిందంటే చాలు.. విద్యార్థులంతా పండుగ చేసుకుంటారు. దసరా హడావుడి ముగిసిందో లేదో, అప్పుడే మరో భారీ సెలవుల ప్యాకేజీ డోర్ కొట్టింది. ఈసారి ఏకంగా దాదాపు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, ఉపాధ్యాయులను పండగ సంబరాల్లో ముంచెత్తింది.

ఈ మెగా బ్రేక్ ప్రకటించింది మరెవరో కాదు.. పండుగలను అంగరంగ వైభవంగా చేసుకునే రాజస్థాన్ రాష్ట్రం. తెలంగాణలో బతుకమ్మ, దసరాను ఎంత ఘనంగా జరుపుకుంటారో, రాజస్థాన్‌లో దీపావళికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే, రాజస్థాన్ విద్యా శాఖ ఆదేశాల మేరకు.. అక్టోబర్ 13వ తేదీ (సోమవారం) నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు పాఠశాలలకు సుదీర్ఘ విరామం లభించింది.

14 Days Holiday from October 13 to 24 Full Details Inside

ముందుగా వచ్చిన ఆదివారం (అక్టోబర్ 12) కలుపుకుంటే, మొత్తంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 13-14 రోజుల పాటు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు. అంటే.. దీపావళి పండుగ ముందే వారి ఇంటికి వచ్చేసినట్టే! ఈ అనూహ్య సెలవుల ప్రకటనతో స్కూల్ పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వరుస సెలవులతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నా, వారి తల్లిదండ్రులు మాత్రం కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. ఇంతకాలం సెలవులు ఇస్తే.. పిల్లలు చదువుకునేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పేరెంట్స్‌కైతే.. పిల్లలను ఇంట్లో భరించే బదులు, స్కూళ్లకు పంపిస్తేనే హాయిగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐతే, ఎలాగో సెలవులు వచ్చాయి కాబట్టి.. ఈ 13 రోజుల విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న కుటుంబాలు టూర్లకు, పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పిల్లల చదువుపై ఆందోళన పడుతున్నా.. పండుగ సంబరాలతో పాటు, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడిపేందుకు ఇదొక మంచి అవకాశం అని పేరెంట్స్ భావిస్తున్నారు. ఈ లాంగ్ బ్రేక్ ముగిశాక, విద్యార్థులందరూ కొత్త ఉత్సాహంతో మళ్లీ చదువుల్లోకి అడుగుపెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+