చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు: 14మంది మృతి
నవన్‌షెహర్: పంజాబ్ రాష్ట్రంలోని బెహ్రం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14మంది మృతిచెందగా, మరో 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 34 మంది ప్రయాణీకులతో ఒక ప్రైవేటు బస్సు నవాషహర్ నుంచి జలంధర్ వెళుతుండగా బెహ్రామ్ గ్రామ సమీపంలో మూలమలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 14మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 20మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోకలితో కొట్టి భర్త హత్య
చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో కట్టుకున్న భర్తనే రోకలితో దారుణంగా కొట్టి చంపింది ఓ మహిళ. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా వాడిపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కాగా, నిందితురాలి హత్య చేసిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications