రిజర్వాయర్‌లో పడిన బస్సు: 22మంది మృతి
బిలాస్‌పూర్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్‌పూర్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ బస్సు గోవింద్ సాగర్ రిజర్వాయర్‌లో పడిపోయింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 36మంది ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారు.
ఇప్పటి వరకు 22మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీసినట్లు బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ అజయ్ శర్మ తెలిపారు. నీటిలో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రగాయాలపాలైన మరో 14 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో ఖచ్చితంగా తెలియదని అధికారులు తెలిపారు. అయితే బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించినట్లు తెలిసిందని చెప్పారు.
రుషికేష్ నుంచి బిలాస్‌పూర్ పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన చెప్పారు. మృతుల సంఖ్యలో పెరిగే అవకాశం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications