వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జికా వైరస్ కలకలం: కేరళలో మరో 14 మందికి సోకిన వ్యాధి, నిర్ధారణ, లక్షణాలు, నివారణ చర్యలివే

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఇప్పటికే కరోనావైరస్ మహమ్మారితో అల్లాడుతున్న కేరళలో జికా అనే కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదు కాగా, తాజాగా, కేరళ రాజధాని తిరువనంతపురంలో కొత్తగా 14 జికా వైరస్ కేసులు వెలుగుచూడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కరోనా 'మూడో’ ముప్పుపై ప్రజలకు మోడీ హెచ్చరిక: 1500 ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, కీలక సమీక్షకరోనా 'మూడో’ ముప్పుపై ప్రజలకు మోడీ హెచ్చరిక: 1500 ఆక్సిజన్ల ప్లాంట్ల ఏర్పాటు, కీలక సమీక్ష

కేరళలో 14 మందికి సోకిన జికా వైరస్..

కేరళలో 14 మందికి సోకిన జికా వైరస్..

రాష్ట్రంలో తొలి జికా వైరస్ కేసు 24 ఏళ్ల గర్భిణీ మహిళలో గురువారం గుర్తించినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. రాష్ట్రం నుంచి మొత్తం 19 నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ)కు పంపగా.. మరో 14 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం వైరస్ బారినపడినవారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్.. డెంగీ లాంటిదే కానీ..

దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్.. డెంగీ లాంటిదే కానీ..

జికా వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ప్రజలను కూడా దోమలు లేకుండా చూసుకోవాలని సూచించింది. కేరళలో జికా వైరస్ ప్రబలుతున్న క్రమంలో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. డెంగీ జ్వరం లక్షణాలే ఉన్నప్పటికీ ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఉన్నతాధికారులతో ఈ వైరస్ పరిస్థితిపై సమీక్షించారు.

జికా వైరస్ వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలేంటి?

జికా వైరస్ వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలేంటి?


జికా వ్యాధి ఈ వైరస్ కలిగిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం ద్వారా సంక్రమిస్తుంది. లైంగికంగా సంక్రమించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. గర్భిణులకు ఈ వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని, ఈ పిల్లలు మైక్రోసెఫాలి(తల చిన్నగా ఉండటం) అనే లక్షణంతో ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఇక జికా వైరస్ వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే.. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింఫ్ గ్రంథులు ఉబ్బడం లాంటి లక్షణాలుంటాయి.

జికా వైరస్ వ్యాధి గుర్తించడం ఎలా? నివారణ చర్యలేంటి?

జికా వైరస్ వ్యాధి గుర్తించడం ఎలా? నివారణ చర్యలేంటి?


జికా వైరస్ వ్యాధిలో రక్త నమూనాలను రియల్‌టైమ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) ద్వారా నిర్ధారించవచ్చు. జికా వ్యాధికి నిర్దిష్టమైన చికిత్సంటూ ఏమీలేదు. రోగి లక్షణాలను గమనించి వైద్యం అందించడం జరుగుతుంది. రోగులకు విశ్రాంతి అవసరం. ఎక్కువ నీటిని తాగాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ లాంటి మందులను తీసుకోవాలి. ఈ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత మరోసారి రాదు.
ఈ వ్యాధి బారినపడకుండా ఉండేందుకు దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లలకు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాగా, జికా వైరస్ వ్యాధి తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత 1954లో నైజీరియాలో వెలుగుచూసింది. 2016లో అనేక దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ వ్యాధి మనదేశంలో వెలుగుచూడటం గమనార్హం.

English summary
14 more cases of Zika virus detected in Kerala state, all in Thiruvananthapuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X