పుణేలో 14 ఏళ్ల బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లు,ఇద్దరు రైల్వే ఉద్యోగులు...
మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. 14 ఏళ్ల ఓ బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ఆ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వన్వాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దీపక్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ బాలిక ఆగస్టు 31న ఇంటి నుంచి పారిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలికను పోలీసులు పుణేలో గుర్తించగా... తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు బాలిక వెల్లడించింది.

ఇంటి నుంచి పారిపోయి వచ్చాక ఆ బాలిక పుణే రైల్వే స్టేషన్‌కు చేరింది. అక్కడి నుంచి రైల్లో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాలనుకుంది. ఇంతలో బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. ఆమె వెళ్లాలనుకుంటున్న రైలు ఆరోజు లేదని... మరుసటి రోజు ఉందని అబద్దం చెప్పాడు. ఆ రాత్రికి తన ఇంట్లో ఉండమని... ఏ భయం అక్కర్లేదని నమ్మించాడు. బాలికను తన ఆటోలో ఎక్కించుకుని బయలుదేరాక.. మరికొందరు ఆటో డ్రైవర్లు అతనికి జతకలిశారు.
మొత్తం 8 మంది కలిసి ఆ బాలికను ఆటోలో సిటీ అంతా తిప్పుతూ పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. చివరకు ముంబై వెళ్లే ఓ బస్సులో ఎక్కమని ఆమెను బలవంతం చేశారు.
మరోవైపు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వన్వాడి పోలీస్ టీమ్ పుణే చేరుకుని బాలిక కోసం గాలించగా ఎట్టకేలకు ఆమె ఆచూకీ కనిపెట్టగలిగారు. బాలిక తనపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి పోలీసులకు చెప్పింది. దీంతో పుణే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు ఆటో డ్రైవర్లు కాగా ఇద్దరు రైల్వే ఉద్యోగులుగా పోలీసులు తెలిపారు.నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications