రాహుల్ గాంధీ పాదయాత్ర.. భారత్ జోడో పేరుతో.. 148 రోజులు
తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల హీట్ నెలకొంది. పార్టీలు తమ వ్యుహాలకు మరింత పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నుంచి భారత్ జోడో పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుడతారు. 148 రోజుల పాటు 12 రాష్ట్రాల్లోని 203 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగనుంది. 3,600 కిలోమీటర్ల మీర సాగే పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలై.. కాశ్మీర్‌లో ముగియనుంది.

వ్యక్తిగతం..
రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. యూరప్ వెళ్లారని.. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన తిరిగి స్వదేశానికి చేరుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం చర్చకు దారితీసింది.

పూర్వవైభవం..
కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏదో ఒక చోట కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు సందర్భాల్లో రాహుల్ విదేశీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత.. అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ రాజీనామాతో సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అధ్యక్ష బాధ్యతలు
మరోసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నారా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఈ ఏడాది మే నెలలో.. రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండులో నైట్‌క్లబ్‌లో ఉన్న ఫొటోలను విడుదల చేసి బీజేపీ విమర్శలు గుప్పించింది. ఫ్రెండ్ పెళ్లి కోసం రాహుల్ నేపాల్‌కు వెళ్లారని.. అందులో ఎలాంటి తప్పు లేదని కాంగ్రెస్ పేర్కొంది.












Click it and Unblock the Notifications