మహారాష్ట్రలో కొవిడ్ విలయం- 15 రోజులు జనతా కర్ఫ్యూ -సెక్షన్ 144 అమలు -కఠిన ఆంక్షలు కొవిడ్ విలయం నేపథ్యంలో మహార

కొవిడ్ విలయం నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధింపు ఉండదని చెప్పినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా బుధవారం రాత్రి 8 గంటల నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలుంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

అత్యవసర సేవలకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని, అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని, అత్యవసర సేవలకే ప్రజారవాణా వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవసరం లేకుండా ప్రజలు ప్రయాణాలు చేయొద్దని, అత్యవసర సేవలకే లోకల్‌ బస్సులు, రైళ్లు వినియోగించాలి. పెట్రోలు బంకులు, బ్యాంకింగ్‌ సంస్థలు పనిచేస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

 15-day janta curfew in Maharashtra from April 14: Whats allowed, whats not

మహారాష్ట్రలో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉందని, రెమిడెసివిర్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోందని, కేసులకు అనుగుణంగా వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నట్లు తెలిపారు. కొవిడ్‌ టీకాల సరఫరాను కేంద్రం మరింత పెంచాలని, తక్షణం ఆక్సిజన్‌ సరఫరా చేయాలని, మహారాష్ట్రకు జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని సీఎం కోరారు.

మహారాష్ట్రలో గురువారం నుంచి అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసివేస్తున్నట్లు సీఎం ఠాక్రే చెప్పారు. మొత్తం 15 రోజుల పాటు.. అంటే, మే 1 వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేత ఉంటుందన్నారు. పేదలకు 3కిలోల గోధుమలు, 2కిలోల బియ్యం పంపిణీ చేస్తాం. ఆటో డ్రైవర్లు, వీధివ్యాపారులకు రూ.1,500 ఆర్థికసాయం అందిస్తామని సీఎం పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+