వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోయలో బస్సు పడి 15 మంది మృతి, ప్రధాని మోడీ విచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణీకులతో లట్టీ బెల్టీ నుంచి ఉదంపూర్‌కు వెళుతోన్న బస్సు జిల్లాలోని మరోటీ బెల్ట్ ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడినట్లు ఉదంపూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా హుటాహుటిన జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది.

 15 dead, 20 injured as bus falls into gorge in Udhampur

సీనియర్ పోలీసు అధికారి సురీందర్ గుప్త ఆధ్వర్యంలో సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. క్యాజువాలిటీలో ప్రయాణీకులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ప్రధాని మోడీ విచారం

జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో సోమవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ వార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. తన ఆలోచనలన్నీ మృతి చెందిన వారి కుటుంబీకుల గురించేనని, క్షతగాత్రుల కోసం ప్రార్ధనలు చేద్దామని ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

అంతే కాకుండా కేంద్ర మంత్రి జితేందక్ సింగ్‌ను ఘటనా స్ధలికి వెళ్లి పరిస్ధితిని సమీక్షించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు.

English summary
Fifteen people died and 20 others were injured, six of them critically, when a bus they were travelling in rolled down into a deep gorge in Udhampur district of Jammu and Kashmir today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X