ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణించిన ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన జేసీబీ వాహనాన్ని ఢీకొట్టి, పల్టీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసుల వివరణ ఇది..
Recommended Video
యూపీ రోడ్ వేస్(యూపీ ఆర్టీసీ)కి చెందిన శతాబ్ది ఏసీ బస్సు ఈ సాయంత్రం కాన్పూర్ నుంచి అహ్మదాబాద్ కు బయలుదేరింది. కాన్పూర్ సిటీ దాటుతూనే బస్సు డ్రైవర్ వేగం పెంచాడు. ఎదురుగా దూసుకొచ్చిన జేసీబీ లోడింగ్ వాహనాన్ని గమనించలేకపోవడంతో నేరుగా దాన్ని గుద్దేశాడు. ఆ దెబ్బకు బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది.

కాన్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మృతదేహాలను వెలికి తీశామని, గాయపడ్డ 24 మందికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications