వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 మందితో రామమందిరం ట్రస్టు: ఒక దళితుడికి చోటు..67 ఎకరాల్లో: అమిత్ షా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన రామ మందిరం ట్రస్టులో 15 మంది సభ్యులకు చోటు కల్పించబోతున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దళిత సామాజిక వర్గానికి ప్రాతినిథ్యాన్ని కల్పిస్తామని అన్నారు. 15 మందిలో ఒక దళితుడికి రామమందిరం ట్రస్టులో తీసుకుంటామని అన్నారు. కోట్లాదిమంది హిందువుల ఆశయానికి అనుగుణంగా అయోధ్యలో మొత్తం 67 ఎకరాల్లో రామమందిర ఆలయం రూపుదిద్దుకుంటుందని చెప్పారు.

రామమందిరం ట్రస్టును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం లోక్‌సభలో ప్రకటించిన వెంటనే.. అమిత్ షా తన ట్విట్టర్‌కు పని చెప్పారు. వరుసగా ట్వీట్లను చేశారు. ట్రస్టుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్రస్టు సభ్యులను త్వరలోనే ఎంపిక చేస్తామని అన్నారు. అయోధ్యలో 67 ఎకరాల స్థలాన్ని త్వరలోనే ట్రస్టుకు బదలాయిస్తామని చెప్పారు.

కోట్లాదిమంది హిందువుల మనోభావాలు ప్రతిఫలించేలా ట్రస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశారని అన్నారు. దీనికి ఆయనకు కృతజ్ఙతలను తెలియజేస్తున్నానని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా.. అత్యద్భుత రామమందిరాన్ని నిర్మిస్తామని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ఆరంభమౌతాయని తాను ఆశిస్తున్నట్లు అమిత్ షా అన్నారు.

English summary
Union home minister Amit Shah said the trust would comprise 15 members, including a Dalit representative who would be in-charge of the entire 67-acre land.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X