అత్యాచారం అడ్డుకుందని కాల్చేశారు, బాలిక మృతి

15 year old girl, burned by men who tried to rape her, dies
లక్నో: పదిహేనేళ్ల బాలిక పైన ఆరుగురు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. అయితే, ఆమె ధైర్యంగా వారిని అడ్డుకొంది. ఆమె పైన అత్యాచారం విఫలమైన నేపథ్యంలో ఎవరికైనా చెబుతుందేమోనని వారు ఆ బాలిక పైన కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆసుపత్రిలో ఆమె మృతి చెందింది.

ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బాలిక పైన అత్యాచారానికి యత్నించి, నిప్పు అంటించిన వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పురలో జరిగింది. ఈ సంఘటన నవంబర్ 17వ తేదీన చోటు చేసుకుంది.

దాడికి పాల్పడ్డ ఆరుగురు బాలిక గ్రామానికి చెందిన వారు. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారు ఆమె పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అత్యాచారయత్నం చేశారు. వారిని ఆమె సమర్థవంతంగా ఎదిరించింది. దీంతో వారు ఆమె పైన కిరోసిన్ పోసి, నిప్పు అంటించారు. అనంతరం వారు అక్కడి నుండి పారిపోయారు.

గాయాలపాలైన బాలికను స్థానికులు షాజహాన్‌పుర మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. రెండు రోజుల అనంతరం బరేలీ మెడికల్ కళాశాలకు తరలించారు. అనంతరం ఉత్తమ వైద్య చికిత్స కోసం మరో ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఆమె మృతి చెందింది. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+