బెదిరించి, బాలికపై 8 నెలలుగా ముగ్గురు గ్యాంగ్‌రేప్

బాధిత బాలికను బెదిరించి మరీ వారు పలుమార్లు అకృత్యానికి పాల్పడ్డారు. ఇటీవల అనారోగ్యానికి గురైన బాలికను వైద్యుల వద్దకు తీసుకు వెళ్లగా ఆమె గర్భిణీ అని తేలడంతో కుటుంబ సభ్యులు నిశ్చేష్టులయ్యారు. దీంతో ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించింది.
మార్చి నెలలో ఇంట్లో తాను ఒంటరిగా ఉన్న సమయంలో తొలిసారిగా ముగ్గురూ కలిసి తన పైన అత్యాచారం చేశారని తెలిపింది. ఆ తర్వాత ఎనిమిది నెలలుగా ఎన్నోసార్లు బెదిరించి తన పైన సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారని పేర్కొంది. దీంతో, నిందితులు ముగ్గురినీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల్లో పదహారేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.
రేపిస్టుల చేతులు నరకండి: శ్రీరామసేన అధ్యక్షుడు
అత్యాచారాలకు కేంద్రంగా మారుతున్న బెంగళూరులో ఆదివారం శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్ల చేతులు నరికేయండని ఆయన బెంగళూరు వాసులకు పిలుపునిచ్చారు.
అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండని, కేసుల్లో ఇరుక్కునే సదరు వ్యక్తుల ఖర్చులు తామే భరిస్తామని ఆయన ఆవేశంతో ఊగిపోయారు. నగరంలో పెరిగిపోతున్న అత్యాచారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications