రాజస్థాన్ లో దారుణం: విద్యార్థినిపై పాఠశాల యజమాని సామూహిక అత్యాచారం, ఆపైన హత్యాయత్నం

రాజస్థాన్ లో విద్యార్థినిపై పాఠశాల యజమాని సామూహిక అత్యాచారం, ఆపైన హత్యాయత్నం

చురు: ఓ విద్యాసంస్థ యజమాని తన బంధువుతో కలిసి తన పాఠశాలలోనే చదువుకుంటున్న ఓ విద్యార్థిని(15)పై అత్యాచారం చేయడమే కాక, తమ కిరాతకం బయట పడుతుందన్న అనుమానంతో ఆ విద్యార్థినిని మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతమిది.

రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ అమానుష ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక చురు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్ టూ చదువుతోంది.

15-year old Student gang raped by School Owner

తన పాఠశాలలో చదువుతున్న ఆ బాలికను ఆమె ఇంటినుంచే సదరు పాఠశాల యజమాని అపహరించినట్లు సమాచారం. ఆపైన అతడు తన బంధువుతో కలిసి అత్యాచారానికి పాల్పడి, ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో ఆ విద్యార్థినిని చంపేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో వారు ఆ విద్యార్థిని కళ్ళలో పొడిచి, వెన్నెముకను కూడా విరిచేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే తమ పిల్లలకు రక్షణ ఎక్కడుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+