పెను విషాదం: లోయలో పడిన ట్రక్కు, 16 మంది ఆర్మీ జవాన్లు మృతి

న్యూఢిల్లీ: సిక్కిం రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉత్తర సిక్కింలో జెమా వద్ద ఆర్మీ ట్రక్కు లోయలోకి జారిపడటంతో 16 మంది సైనికులు మరణించారు. ఈ ఆర్మీ వాహనం మూడు వాహనాల కాన్వాయ్‌లో భాగంగా ఉంది.

ఈ వాహనం ఉదయం చటెన్ నుంచి థంగు వైపు వెళ్లింది. జెమాకు వెళ్లే మార్గంలో, వాహనం వేగంగా మలుపు తీసుకుంటుండగా నిటారుగా ఉన్న వాలుపైకి జారిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 16 army personal died in accident an North Sikkim.

"వెంటనే ఒక రెస్క్యూ మిషన్ ప్రారంభించారు. గాయపడిన నలుగురు సైనికులను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ప్రమాదంలో గాయపడిన ముగ్గురు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు, 13 మంది సైనికులు మరణించారు. ఈ సమయంలో నష్టపోయిన కుటుంబాలకు భారత సైన్యం అండగా నిలుస్తుంది అని ఆర్మీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది ఉన్నారు.

నలుగురు జవాన్లను చికిత్స కోసం విమానంలో తరలించినట్లు వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘోర ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు.

'వారి సేవ, నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని రక్షణ మంత్రి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రమాదంలో చనిపోయిన 16 మంది సైనికులను గుర్తించారు. వారిని అక్కడ్నుంచి తరలించారు. మిగితా నలుగురు సైనికులు తీవ్రంగా పడ్డారు. ప్రస్తుతం ఈ నలుగురు ఆర్మీ సిబ్బంది ఆస్పత్రిలో చకిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+