బేబీ డైపర్లలో 16కిలోల బంగారం బిస్కెట్లు: సీజ్
న్యూఢిల్లీ: అధికారుల కళ్లు గప్పేందుకు అక్రమార్కులు అనేక దారులు వెదుకుతున్నారు. కానీ, అధికారులు చాకచక్యంగా వ్యవహిరంచడంతో వారికి అది సాధ్యం కావడం లేదు. తాజాగా, బంగారం అక్రమ రవాణా చేసేందుకు బేబీ డైపర్లను ఉపయోగించారు అక్రమార్కులు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నారుల డైపర్లలో దాచిన 16కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న అక్రమార్కుల నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురు ప్రయాణికులతో కూడిన బృందం దుబాయ్ నుంచి ఇక్కడకు చేరుకుందని, తమతోపాటు తీసుకొస్తున్న ఇద్దరు పిల్లల డైపర్లలో ఈ బిస్కెట్లను చాలా తెలివిగా దాచి పెట్టారని అధికారులు తెలిపారు. అయితే, తనిఖీల్లో భాగంగా వాటిని పట్టుకున్నట్లు చెప్పారు.
ఒక్కొటి కిలో బరువున్న 16 బంగారు బిస్కెట్లను రెండు గ్రూపుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వీరిలో సూరత్‌కు చెందిన దంపతులు కూడా ఉన్నారని, అందర్నీ విచారిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications