వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ సెషన్, రాష్ట్రపతి రామ్‌నాథ్ ప్రసంగం బహిష్కరణ.. 16 పార్టీలు

|
Google Oneindia TeluguNews

బడ్జెట్‌ సమావేశాలు 29వ తేవీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ప్రసంగం చేస్తారు. అయితే ఆ స్పీచ్‌ను బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు ఆమోదించుకున్నారని ఆరోపించాయి.

వ్యవసాయ చట్టాల వల్ల ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు బహిష్కరించామని తెలిపాయి.

 16 parties decided boycott president speech

Recommended Video

AP Panchayat Elections 2021 : TDP Chief Chandrababu Naidu Released Manifesto

కొత్త వ్యవసాయ చట్టాలతో ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉభ‌య స‌భ‌ల్లో సాగు చ‌ట్టాల‌ను బ‌ల‌వంతంగా ఆమోదం చేయించారని ఆరోపించారు రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున హింసాత్మక ఘటనలను ఖండించారు. దుశ్చర్యల వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని 16 పార్టీలు పేర్కొన్నాయి. అందుకోసం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశాయి.

English summary
16 parties decided boycott president of india ramnath kovindh speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X