మీది అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్- ప్రధాని మోదీపై ప్రముఖ నటి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని మోదీ సూచించారు. బంగారాన్ని కొనకుండా ఉండాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్ తో పాటు చివరికి వంటనూనె వినియోగాన్ని సైతం తగ్గించుకోవాలని సూచించారు.

కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు వంటి అనేక వ్యవస్థలను అవలంబించామని, వాటికి అలవాటుపడ్డామని కూడా మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతులను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అది జాతీయ ప్రయోజనాలకు అత్యవసరమని, వాటికి మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారమే చెలరేగుతోంది.

Actress Ramya takes a dig at PM Modi over his statements urging citizens to cut fuel and Many more

బులియన్ మార్కెట్ ను దెబ్బకొట్టాయి. తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రత్యేకించి జ్యవెలరీ స్టాక్స్ కుప్పకూలాయి. ఆయా కంపెనీల షేర్లన్నీ ఢమాల్ అయ్యాయి. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే జ్యువెలరీ షేర్లన్నీ కూడా పతనం అయ్యాయి. టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, గోల్డియం ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ బంగారు స్టాక్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతోండటం, దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ కీలక ప్రకటన చేయాల్సి వచ్చింది.

దీనిపై తాజాగా ప్రముఖ కన్నడ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం పౌరులను ఇంధనం, ప్రయాణం, వంటనూనె, బంగారం వంటి ఐచ్ఛిక వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరడం దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని, దిగుమతులపై భారాన్ని, ద్రవ్యోల్బణాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో, పటిష్టంగా వ్యవహరించిందని గుర్తు చేశారు.

అప్పటి ఆర్థిక మాంద్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ సింగ్ అత్యంత పరిణతితో నిర్వహించారని రమ్య చెప్పారు. 1967లో ఇందిరా గాంధీ బంగారం కొనవద్దని కోరినప్పుడు, స్వాతంత్ర్యం పొందిన 20 ఏళ్లే అయిన భారత్ పేదరికం, వనరుల కొరతతో సతమతమయ్యిందని, ఆ చారిత్రక సందర్భంలో అలాంటి అభ్యర్థన సమంజసమేనని వ్యాఖ్యానించారు. నేడు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇలాంటి విజ్ఞప్తులు చేయాల్సి రావడం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+