ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపు పై ఊహించని పరిణామం, కీలక మలుపు..!?
ఢిల్లీలో ఏపీ కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. 2029 ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ సైతం ఇక జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. కేంద్రం గత నెలలో ప్రతిపాదించిన మహిళా రిజర్వేష న్లు.. డీలిమిటేషన్ బిల్లు వీగిపోవటంతో.. ఇప్పుడు కొత్త లెక్కలు మొదలయ్యాయి. ఏపీ పునర్విభజ న చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు పైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో.. సాంకేతిక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. సీట్ల పెంపు పైన తాజా ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఏపీ లో కలిసొచ్చేదెవరికి అనే చర్చ మొదలైంది.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు పైన ఢిల్లీ కేంద్రంగా మరోసారి కదలిక మొదలైంది. తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. కేంద్రం తాజాగా మహిళా బిల్లు - డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో.. తాజా చర్చల్లో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ- తెలంగాణ లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండటంతో.. పూర్తి చేసి నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. సెన్సెస్ పూర్తయిన తరువాత చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు పూర్తి కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో.. ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్ చేశారు.

కేంద్రంలో మారుతున్న సమీకరణాలు
అయితే, కూటమిలో ఉన్న మూడు పార్టీల నుంచి వచ్చే ఎన్నికల నాటికి ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో.. డీలిమిటేషన్ పూర్తయితే మూడు పార్టీల కేడర్ లో మద్దతు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం కేంద్రంలో పరిణామాలు.. సాంకేతిక అంశాల కారణంగా 2029 నాటికి సీట్ల పెంపు సందేహంగానే కనిపిస్తోంది. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయలోనూ తన వైఖరిని తేల్చిచెప్పింది. యోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు. ఆ తర్వాత పునర్విభజన చేపడితే.. 2034 ఎన్నికలకు కొత్త నియోజవకర్గాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుందనేది రాజకీయంగా చర్చ మొదలైంది.













Click it and Unblock the Notifications