విడాకుల బాటలో మరో బాలీవుడ్ బ్యూటీ!
Mouni Roy: బాలీవుడ్ ప్రముఖ నటి మౌనీ రాయ్ తన వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు సినీ ప్రపంచంలో సంచలనంగా మారాయి. 2022లో దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకున్న మౌనీ రాయ్.. ప్రస్తుతం అతనితో విభేదాల కారణంగా విడిపోయే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరిగిన కొన్ని పరిణామాలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి.
తాజా సమాచారం ప్రకారం.. మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ ఇన్ స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఒకప్పుడు తమ వెకేషన్ ఫోటోలతో నెటిజన్లను అలరించిన ఈ జంట.. ఇప్పుడు సోషల్ మీడియాలో దూరంగా ఉండటం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అంతేకాకుండా సూరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి మౌనీతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలను కూడా తొలగించినట్లు సమాచారం. ఈ పరిణామాలను గమనించిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగిందని.. బహుశా వీరు విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్‌ల ప్రేమకథ 2019లో దుబాయ్‌లో ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. 2022లో గోవాలో మలయాళ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం, ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది మిస్టరీగా మారింది.
ప్రస్తుతం ఈ పుకార్లపై అటు మౌనీ రాయ్ కానీ, ఇటు సూరజ్ నంబియార్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అభిమానులు మాత్రం వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే సెలబ్రిటీల జీవితాల్లో సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడం అనేది తరచుగా విడిపోవడానికి సంకేతంగా మారుతుండటంతో మౌనీ రాయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ జంట తమ బంధంపై ఎలాంటి స్పష్టత ఇస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications