మావోయిస్టుల ఘాతుకం: 16మంది గిరిజనుల హత్య
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ ప్రాంతంలో మావోయిస్టులు బుధవారం దారుణానికి తెగబడ్డారు. ఇన్ ఫార్మర్ల నెపంతో సుమారు 16మంది గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు.
మావోయిస్టుల దుశ్చర్యపై తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసిందని రాష్ట్ర హోంమంత్రి అజయ్ చంద్రశేఖర్ తెలిపారు. మావోయిస్టుల చర్యకు సరైన సమాధానమిస్తామని అన్నారు.

మావోయిస్టులు అమాయక గ్రామస్తులను చంపడంపై బస్తర్ ఐజి కల్లూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మానవ హక్కుల సంఘం ప్రతినిధులు వచ్చి పరిశీలించాలని సవాల్ విసిరారు.
మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ప్రతీకార చర్యగా గ్రామస్తులను చంపినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications