తుపాకీతో బెదిరించి యువతిపై గ్యాంగ్‌రేప్: అరెస్ట్
బాఘపత్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాఘపత్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు తుపాకీతో బెదిరించి 16ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుందని పోలీసులు సోమవారం తెలిపారు.
ఆన్‌లైన్ ఫాం నింపేందుకు నెట్ సెంటర్‌కు వెళ్లిన సమయంలో కంప్యూటర్ సెంటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న దీపక్ అనే యువకుడు, అతడి స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

ఆమెను తుపాకీతో బెదిరింపులకు గురి చేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని తెలిపారు. ప్రధాన నిందితుడు దీపక్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశామని ఏఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
బాధితురాలు, నిందితులు భిన్న సమాజిక వర్గాలకు చెందినవారు కావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications