సిగరెట్ ఇవ్వలేదని అన్నను చంపేశాడు
న్యూఢిల్లీ: చిన్న విషయంలో గొడవపడి తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన సంఘటన ఢిల్లీ నగరంలో కలకలం రేపింది. ఢిల్లీ నగరంలోని మంగోల్ పురి ప్రాంతంలో 18 సంవత్సరాల యువకుడు తమ్ముడి చేతిలో హత్యకు గురైనాడు.
మంగోల్ పురి ప్రాంతంలో (18), (16) వయసు ఉన్న ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో వీరి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. ఇంటి దగ్గర వీరిద్దరే ఉన్నారు.
రాత్రి 7 గంటల సమయంలో అన్న సిగరెట్ తాగుతున్నాడు. ఆ సమయంలో ఇంటిలోకి వెళ్లిన తమ్ముడు తనకు సిగరెట్ కావాలని చెప్పాడు. సిగరెట్ ఇవ్వడానికి అన్న నిరాకరించాడు. ఇద్దరి మద్య మాటామాట పెరిగింది.

సహనం కొల్పోయిన తమ్ముడు సమీపంలోని ఫ్యాన్ తీసుకుని అన్న తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అన్న కిందపడి సృహ కొల్పోయాడు. తమ్ముడు అక్కడి నుంచి పరారైనాడు.
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు సృహ కొల్పోయి పడి ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించాడని వైద్యులు చెప్పారు. బాలుడు పడి ఉన్న తీరు చూసి దొంగలు హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు.
అయితే చేసిన తప్పుకు కుంగిపోయిన తమ్ముడు గురువారం క్షమించమని అడగడానికి ఇంటికి వెళ్లాడు. అప్పటికే జరిగిన విషయం తెలుసుకుని తమ్ముడు విలపించాడు. పోలీసుల ముందు చేసిన తప్పును అంగీకరించాడు. బాలుడిని జువెనైల్ హోంకు తరలించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications