యూపీలో 8 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం... దూరపు బంధువే...

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల టీనేజ్ అబ్బాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్తీ జిల్లాలో ఆదివారం(సెప్టెంబర్ 12) ఈ ఘటన చోటు చేసుకుంది.మహిళలపై అత్యాచారాలు,నేరాలతో ఉత్తరప్రదేశ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

బస్తీ జిల్లాకు చెందిన ఎస్పీ అవినాష్ శ్రీవాస్తవ వెల్లడించిన ప్రకారం... ఆదివారం సాయంత్రం తమకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. అవతలి వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ... తన కుమార్తె అత్యాచారానికి గురైనట్లు చెప్పాడని తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించామన్నారు.

16 years old teenager rapes 8 years gilr in uttar pradesh

ఆ కుటుంబానికి దూరపు బంధువైన 16 ఏళ్ల టీనేజ్ అబ్బాయి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు.బాలిక ఇంటి పక్కనే అతని ఇల్లు ఉందన్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబైలో ఓ అత్యాచార బాధితురాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల ఆ మ‌హిళపై శుక్రవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో అత్యాచారం జరిగింది. అత్యాచార అనంతరం దుండగులు ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్డును జొప్పించి చిత్రహింసలకు గురిచేశారు.బాధితురాలు ఆస్పత్రిలో చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ మృతి చెందింది.ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన 9 ఏళ్ల క్రితం 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ తన స్నేహితుడితో కలిసి రాత్రిపూట బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో.. బస్సు డ్రైవర్ రామ్‌సింగ్ సహా ఆరుగురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తెలంగాణలోనూ ఓ అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల గిరిజన బాలిక శనివారం(సెప్టెంబర్ 9) హత్యాచారానికి గురైంది.స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయినా ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో జులాయిగా తిరిగే రాజుపై అనుమానం వచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ చిరు నవ్వులతో ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ ఓ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే పోలీసులు క్లూస్ టీమ్ పలు వివరాలు సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+