Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రయాణికులంతా గాఢ నిద్రలో: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22మంది మృతి!

బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది.

బరేలి: ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో బస్సు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో 22మంది మృత్యువాత పడగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బరేలీ షహ్జాన్ పూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రమాద స్థలంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. బస్సును డ్రైవర్ సరైన మార్గంలో నడపనందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

17 dead, several injured after bus collides with truck on Bareilly national highway

బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+