14 ఏళ్ల బాలికను రేప్ చేసిన 17 ఏళ్ల బాలుడు, అత్త సొమ్ము అల్లుడు దానం, మరో ముగ్గురు గ్యాంగ్ రేప్!
న్యూఢిల్లీ: పని చేస్తున్న చోట పరిచయం అయిన 14 ఏళ్ల బాలిక (మైనర్)ను నమ్మించి పిలిపించిన 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అనే సామెతలాగా బాలికను మరో ముగ్గురు కమాంధులకు ఆ బాలుడు అప్పగించాడు. జరిగిన అన్యాయం గురించి బాలిక ధైర్యంగా పోలీసులకు చెప్పడంతో నలుగురు కామాంధుల అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పని చేసేచోట పరిచయం
దేశ రాజధాని ఢిల్లీలోని (దక్షిణ ఢిల్లీ) గ్రేటర్ కైలాష్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంటిలో 14 ఏళ్ల బాలిక పని చేసేది. అదే ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు పని చేసేవాడు. ఆ సందర్బంలో బాలుడు, బాలికకు పరిచయం అయ్యింది. ఆ సమయంలో బాలికకు తెలిసీ తెలియని వయసు కావడంతో కొంత కాలం ఇద్దరూ స్నేహితులుగా కలిసి మెలసి తిరిగారు.

ఒక్కసారి రావాలి.... హెల్ప్ చేస్తాను
నెల రోజుల క్రితం బాలిక పని చేస్తున్న చోట ఉద్యోగం మానేసింది. తరువాత కైలాష్ ఆ బాలికతో టచ్ లో ఉన్నాడు. తాను పని చేస్తున్న చోటకు ఒక్కసారి వచ్చిపోవాలి, నీకు మరో చోట ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ ఆ బాలుడు బాలికకు మాయమాటలు చెప్పాడు. ఫ్రెండ్ పిలిస్తున్నాడని ఆ బాలిక శనివారం ఒంటరిగా బాలుడు పని చేస్తున్న దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి వెళ్లింది.

అత్త సొమ్మ అల్లుడు దానం అన్నట్లు
బాలిక గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి వెళ్లిన తరువాత ఆమె 17 ఏళ్ల స్నేహితుడు తియ్యటిమాటలు చెప్పాడు. తరువాత బాలికను గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని సర్వెంట్ క్వాంటర్స్ లోకి తీసుకెళ్లిన 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అనే సామెతలాగా బాలికను మరో ముగ్గురు కమాంధులకు ఆ బాలుడు అప్పగించాడు.

ఆ నలుగురు అరెస్టు
తన మీద 17 ఏళ్ల తన స్నేహితుడితో పాటు 18 ఏళ్లు, 20 ఏళ్లు, 30 ఏళ్ల వయసు ఉన్న మరో ముగ్గురు కూడా అత్యాచారం చేశారని ఆదివారం బాలిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు బాలిక మీద అత్యాచారం చేసిన నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

క్రైమ్ రేట్ తగ్గింది మిత్రమా
గత ఏడాదితో పోల్చుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారం కేసులు 28 % తగ్గాయని స్థానిక పోలీసులు అంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నెల వరకు 1, 723 అత్యాచారం కేసులు నమోదైనాయని, ఈ ఏడాది సెప్టెంబర్ నెల వరకు 1, 241 అత్యాచారం కేసులు నమోదైనాయని స్థానిక పోలీసులు తెలిపారు. దేశంలో ఎక్కడైనా అత్యాచారం జరిగి మహిళలు హత్యకు గురైతే వాటిని హత్య కేసులుగా నమోదు చేస్తున్నారని, అత్యాచారం కేసులుగా నమోదు చెయ్యకుండా క్రైమ్ రేట్ తగ్గించడానికి కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అనేక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications