పక్కింటి వ్యక్తి గర్ల్‌ను గదిలోకి లాగి.., సూసైడ్‌యత్నం

ఈ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాలికను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బట్టబయలు అయింది. పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.
బాధిత బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. మనీష్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఉంటున్న భవనంలోనే అతను అద్దెకు ఉంటున్నాడు. అత్యాచార ఘటన జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు వారి వారి ఉద్యోగాలకు వెళ్లారు.
మనీష్ తనను తన గదిలోకి లాక్కెళ్లాడని, తర్వాత అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది. బాధిత బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. తన పైన మనీష్ అత్యాచారాన్ని జీర్ణించుకోలేని బాలిక సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని అత్మహత్యాయత్నం చేసింది. ఇది చూసిన పక్కింటి వ్యక్తి ఆమెను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications