కరోనాను మోసుకొస్తున్న ప్ర‌యాణికులు.. అమృతసర్ ఎయిర్ పోర్టులో 173 మందికి పాజిటివ్

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు కరోనా మహమ్మారిని మోసుకొస్తున్నట్లు ఉంది పరిస్థితి. అమృతసర్ ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికుల్లో భారీగా కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఈ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు ఇటలీ నుంచి వచ్చిన విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా ఆ దేశం నుంచి వచ్చిన‌ మరో విమానంలో 173 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కేవలం రెండు రోజుల్లో ఇటలీ నుంచి వచ్చిన 298 మంది ప్రయాణికులకు కరోనా నిర్థారణ కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

మొత్తం 290 మంది ప్ర‌యాణికుల్లో.. 173 పాజిటివ్ కేసులు

మొత్తం 290 మంది ప్ర‌యాణికుల్లో.. 173 పాజిటివ్ కేసులు


ఇటలీలోని రోమ్ నుంచి ఓ చార్టర్డ్ ఫ్లైట్ పంజాబ్ లోని అమృతసర్ విమానాశ్రయానికి శుక్రవారం చేరుకుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎయిర్ ఫోర్ట్‌లోనే ఆ ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫ్లైట్‌లో వచ్చిన మొత్తం 290 మంది ప్రయాణికులలో 173 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అమృతసర్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ వీకే సేథ్ తెలిపారు. వైరస్ సోకిన బాధితులందరిని నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు తెలిపారు..

 క‌రోనాను మోసుకొస్తున్న ప్ర‌యాణికులు

క‌రోనాను మోసుకొస్తున్న ప్ర‌యాణికులు


ఇటలీలోని మిలాన్ నుంచి గురువారం అమృతసర్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది. ఈ ఫ్లైట్‌లో మొత్తం 179 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో దిగారు. వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కు తరలించారు. అయితే వారిలో 13 మంది ప్రయాణికులు ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం వారికి కోసం అమృతసర్ పోలీసులు గాలిస్తున్నారు.

రిస్క్ దేశాల జాబితాలో ఇటలీ

రిస్క్ దేశాల జాబితాలో ఇటలీ

ఇటలీని రిస్క్ దేశాల జాబితాలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేసింది. ఈనేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులలో కరోనా లక్షణాలు కన్పించడంతో కేంద్రం తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చి వారిలో కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ .. వారు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. 8వరోజు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. ఆ రిపోర్ట్ ను ఎయిర్ సువిధ పోర్ట్ ల్ లో ఆప్ లోడ్ చేయాలని వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+